ఢిల్లీ లోని పలు స్కూళ్ల కి బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. అప్రమత్తమైన స్కూలు యాజమాన్యాలు వెంటనే పోలీసు కి సమాచారం ఇచ్చాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేయించాయి, వెంటనే రంగం లోకి దిగారు ఢిల్లీ పోలీసులు. బాంబు డిస్పోసబుల్ బృందం, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. ద్వారకా, చాణిక్యపురి, మయూర్ విహార్, చాణిక్యపురి, వసంత్ కుంజ్, సాకేత్ పాఠశాలలకు తొలుత బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ లోని పలు స్కూళ్ల కి బాంబు బెదిరింపు మెయిల్స్ |
నోయిడా లోని దాదాపు 50 పాఠశాలలకు మొదట ఈ బెదిరింపు ఈ -మెయిల్స్ వచ్చాయి. రక్షణ చర్య లో భాగంగా పిల్లల తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చి స్కూల్ పిల్లలని తిరిగి ఇంటికి పంపిస్తునట్టు పోలీసులు, పాఠశాల యాజమాన్యాలు తెలియజేశాయి. ఈ ఘటన ఫై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు, బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకుంటున్నారు. ఇక VPN మోడ్ లో విదేశీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది అని పోలీసులు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ద్వారా పోలీసులు ముమ్మర గాలింపు చెప్పటారు. అన్ని పాఠశాలలకు ఓకే రకమైన బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు పోలీసు విభాగం గుర్తించింది. ఇప్పటి వరకు తనిఖీ లలో ఎటువంటి ఆధారాలు గుర్తించలేదు అని పోలీస్ విభాగం తెలియచేసింది. అలాగే మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయి ఎవరు పంపించారు అని దర్యాప్తు వేగవంతం చేసారు. వరసగా ఈ లాంటి బెదిరింపు మెయిల్స్ రావడం తో పోలీసు విభాగం చాల సీరియస్ గా ఈ సంఘటన ఫై దృష్టి సారించింది. మరిన్ని దేశ, రాష్ట్రా మరియు సైన్స్ & టెక్నాలజీ, క్రీడా, ఉద్యోగా వార్త సమాచారం కొరకు pidugu.online వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి