మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల కమిషన్ అఫ్ ఇండియా కేసీఆర్ కి 48 గంటలు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ నేత నిరంజన్ కాంగ్రెస్ నేతల పై కలవకుంట్ల చంద్రశేఖర్ రావు అభ్యంతరకర వాక్యాలు చేసారు అని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసారు. నిరంజన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్ కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ పై 48 గంటల నిషేధం విధించింది.
మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం |
ఎన్నికల కమిషన్ ఇవాళ్టి రాత్రి 8.00 గంటల నుండి నుంచి కేసీఆర్ పై నిషేదం అమలులోకి వస్తుంది అని తెలియచేసింది. తెరాస అధినేత పార్లమెంట్ ఎన్నికల సమయం కాబ్బటి బస్సు యాత్ర తో బిజీ గా ఉన్న సమయం లో ఎన్నికల కమిషన్ 48 గంటలు ప్రచార కారిక్రమాలలో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. దీనితో తెరాస అధినేత ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలో పాల్గొనకుండా భారతా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే కేసీఆర్ బస్సు యాత్ర 7వ రోజు కొనసాగుతుంది. నిన్న కేసీఆర్ ఖమ్మం లో, కొత్తగూడెం లో ప్రచారం ముగుంచు కొని ఇవ్వాళా మహబూబాబాద్ అభ్యర్థి మాలోథ్ కవిత కి మద్దత్తు గా ప్రచారం లో పాల్గొన్నాడు. గతం లో సిరిసిల్ల లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు పార్టీని ఉద్దేశించి. నేతలని ఉద్దేశించి చేశారో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు పైన ఇప్పటికే బి ఆర్ ఎస్ పార్టీ కి కేసీఆర్ కు నోటీసులు వచ్చాయి, కానీ బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ ఎటువంటి జవాబు రాకపోవడం తో ఎన్నికల కమిషన్ అఫ్ ఇండియా కేసీఆర్ కి 48 గంటలు ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.